హాస్టల్ విద్యార్థులకు మెడికేటెడ్ దోమతెరల పంపిణీ
1 min read
న్యూస్ నేడు , పత్తికొండ : పత్తికొండ పట్టణంలోని పలు హాస్టల్ విద్యార్థులకు స్థానిక మెడికల్ వైద్య సిబ్బంది శుక్రవారం దోమల బారి నుండి కాపాడడానికి మెడికేటెడ్ దోమతెరలు పంపిణీ చేశారు. స్థానిక గురుకుల బాలికల పాఠశాలలోని 129 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. అలాగే కస్తూర్బా పాఠశాలలోని వందమంది బాలికలకు, బీసీ గర్ల్స్ హాస్టల్ లోని 100 మంది బాలికలకు, ఎస్సీ నంబర్ వన్ బాలుర హాస్టల్లోని 40 మంది విద్యార్థులకు, ఎస్సీ నంబర్ 2 హాస్టల్లోని 100 మంది విద్యార్థులకు మెడికేటెడ్ దోమతెరలు పంపిణీ చేశారు. దోమల బారి నుండి కాపాడడానికి హాస్టల్లోని విద్యార్థులందరికీ మెడికేటెడ్ దోమతెరలు పంపిణీ చేశామని, వాటిని విద్యార్థులందరూ సద్విని చేసుకోవాలని స్థానిక మెడికల్ ఆఫీసర్ సుజాత ఈ సందర్భంగా కోరారు. దోమతెరలు మేటికేటెడ్ గా ఉంటాయని దోమలు దోమతెర దరికి చేరవని ఆమె తెలిపారు. తప్పనిసరిగా విద్యార్థులు దోమతెరలు కట్టుకొని నిద్రపోవాలని ఆమె సూచించారు. మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, మలేరియా అసిస్టెంట్ ఆఫీసర్ రమేషు, పుచ్చకాయల మాడ వైద్య సిబ్బంది ఆస్పరి సాయిబాబా ప్రకాశం, వరలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



