NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రసాద్ సార్ కి ప్రియతమ సహ ఉద్యోగులు అభినందనల వెల్లువ…

1 min read

అక్షరమే ఆయుధంగా మలచుకొని విద్యార్థుల భవితను తీర్చిదిద్దుతున్న ప్రసాద్ సార్ కి ఆత్మీయ అభినందనలు

న్యూస్ నేడు, పత్తికొండ:  అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ, విలువలతో కూడిన విద్యను అందిస్తూ 26 సంవత్సరాల ఉపాధ్యాయ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసి, 27వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రసాద్ సార్ కి ప్రియతమ సహ ఉద్యోగులు అభినందనలు వెల్లువెత్తాయి. ఆయన ఉపాధ్యాయ వృత్తికి నిలువెత్తు సాక్ష్యగా  నిలుస్తూ, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న సందర్భంగా అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తి అంటే కేవలం పాఠాలు బోధించడం మాత్రమే కాదు… ఎన్నో జీవితాలకు వెలుగులు పంచడం, ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేయడం. అటువంటి పవిత్రమైన బాధ్యతను అంకితభావంతో, నిబద్ధతతో నిర్వర్తిస్తూ మీ 26 ఏళ్ల ప్రస్థానం ఎందరికో ఆదర్శప్రాయమని పలువురు ఆయనను పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. ప్రసాద్ సార్  అనుభవం మరెన్నో తరాలకు మార్గదర్శకం కావాలని, ఆయన జ్ఞానం మరెందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయన సేవా ప్రస్థానం మరింత విజయవంతంగా కొనసాగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ప్రసాద్ సార్  మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, ఆయురారోగ్యాలు, ఆనందం, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రసాద్ సార్  అభిమానులు కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *