NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యువత మారుతున్నటెక్నాలజీ నికి అనుగుణంగా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

1 min read

–  జాయింట్ కలెక్టర్ నూరుల్ కుమార్

కర్నూలు,న్యూస్​ నేడు:  వికసిత్ భారత్ @ 2047 లో భాగముగా యువతను  వినూత్నమైన ఆవిష్కరణలలో భాగస్వామ్యం చేయుట కొరకు, భారత ప్రభుత్వ ఆదేశాలనుసారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, యువజన సర్వీసుల శాఖ మరియు మై భారత్ సంయుక్త ఆధ్వర్యంలో “వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్,  2027 – ఛాలెంజ్ ట్రాక్ లో బాగంగా ఈరోజు జి.పుల్లా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా ఛాంపియన్షిప్ పి.పి.టి రౌండ్ పోటీలు నిర్వహించడమైనది.ఈ సందర్బంగా జిల్లా ఛాంపియన్షిప్ పి.పి.టి రౌండ్ విజేతల ఎంపిక కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన జాయింట్ కలెక్టర్ నూరుల్ కుమార్ గారు మాట్లాడుతూ గతం లో ఒక కుటుంబం వారి జీవిత కాలం లేదా వారి తాత ముత్తాతల కాలం నుంచి ఒకే ఒకే వృత్తిలో, ఒకే కుల వృత్తిని లో జీవనం సాగించేవారని వారని, ప్రస్తుతం పరిస్థితి ఆలా లేదని రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి టెక్నాలజీ మారి పోయి కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయని, కుల వృత్తులకు దూరంగా వారికీ నచ్చిన వృత్తిలో లేదా టెక్నాలజీ తో పోటీ పడి రక రకాల ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.తదుపరి డా.కె.వేణుగోపాల్. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజమ్ అధికారి తిరుమల నాయుడు, మై భారత్ జిల్లా యువజన అధికారి శ్రీ ఐజయ్య , పుల్లా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు  డా.దేవకీ, శ్రీ మురళి కృష్ణ, శ్రీ కురిడి సురేష్, ఆర్.జి.యం ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు డా.సోఫియా ప్రియదర్శిని మరియు కర్నూలు మరియు నంద్యాల నుంచి యువత పాల్గొన్నారు. 

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *