క్లస్టర్ కేంద్రాల ఎంపిక నిష్పక్షపాతంగా జరగాలి
1 min read
వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ నిసార్ అహమ్మద్
మదనపల్లె బి. శ్రీనివాసులు రెడ్డి న్యూస్ నేడు ప్రతినిధి :త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసే క్లస్టర్ కేంద్రాల ఎంపిక నిష్పక్ష పాతంగా జరగాలని వైఎస్సార్సీపీ మదనపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్. నిసార్ అహమ్మద్ కోరారు. ఈ సందర్బంగా శుక్ర వారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. రాజకీయ పక్ష పాతానికి తావు లేకుండా అన్ని పార్టీల అభ్యర్థులకు సమాన అవకా శాలు కల్పించాలని, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా నామినే షన్లు దాఖలు చేసుకునేలా చర్యలు తీసు కోవాలని కోరారు.మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వ హించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ యూనస్, యాసిన్, మాలేపాడు చలపతి, అబ్దుల్లా, సాధిక్ లు పాల్గొన్నారు.


