NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ప్రారంభ మైన 70వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ నెట్బాల్ పోటీలు

1 min read

మదనపల్లె బి. శ్రీనివాసులు రెడ్డి న్యూస్ నేడు ప్రతినిధి :మదనపల్లె రూరల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్న తిప్ప సముద్రం నందు 70వ రాష్ట్రస్థాయి నెట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  ఉప విద్యాశాఖ అధికారి పద్మావతి,  ఎంఈఓ లు ప్రభాకర్ రెడ్డి ,రాజగోపాల్ , ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్లు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వాలని ఆకాంక్షించారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో రాష్ట్రం లోని 13 ఉమ్మడి జిల్లా బాల బాలికల జట్లు పాల్గొన్నారు. క్రీడాకారులకు భోజన వసతి సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి రమేష్ బాబు, జయ, క్రిస్టీ పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *