NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పంచాయితీ నామినేషన్ల కేంద్రాలు ఇవే

1 min read

డిసెంబర్ 2న పంచాయితీ ఎన్నికలు

ఎంపీడీవోలు మిడుతూరు దశరథ రామయ్య, నందికొట్కూరు సుబ్రహ్మణ్యం శర్మ..

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మరియు మిడుతూరు మండలాల్లో ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్లు వచ్చేనెల డిసెంబర్ 2వ తేదీన 3 వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు నందికొట్కూరు, మిడుతూరు ఎంపీడీవోలు సుబ్రహ్మణ్యం శర్మ,పి దశరథ రామయ్య శనివారం సాయంత్రం తెలిపారు.

మిడుతూరు మండలంలో నామినేషన్లు వేసే కేంద్రాలు

మిడుతూరు మండలంలో 19 గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు జరుగు ఎన్నికల నామినేషన్లు వేసే 5 కేంద్రాలు ఇవే:

1.మిడుతూరులో:మిడుతూరు,వీపనగండ్ల,చింతలపల్లి,పీరు సాహెబ్ పేట..2 కడుమూరులో:

కడుమూరు,పైపాలెం, నాగలూటి,మాసపేట..

3.చౌట్కూరు:చౌటుకూరు

49 బన్నూరు,దేవనూరు..

4 రోళ్ళపాడు:రోళ్ళపాడు తలముడిపి,జలకనూరు, అలగనూరు..5 చెరుకుచెర్ల:

చెరుకుచెర్ల,తిమ్మాపురం, బైరాపురం,సుంకేసుల గ్రామాలకు చెందిన ప్రజలు నామినేషన్లు కేంద్రాల్లో వేయవచ్చని ఎంపీడీవో తెలిపారు.

నందికొట్కూర్ మండలంలో నామినేషన్లు వేసే కేంద్రాలు

నందికొట్కూరు మండలం రూరల్ 12 గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు నామినేషన్లు వేసే కేంద్రాల వివరాలు:1 బ్రాహ్మణ కొట్కూరు:దామగట్ల,10 బొల్లవరం,కోళ్ల బావా పురం..2 అల్లూరు:అల్లూరు మల్యాల,శాతనకోట, కోనేటమ్మ పల్లె,వడ్డెమాను..3.కొణిదేల: కొణిదేల,నాగటూరు, బిజినవేముల ఈ గ్రామాల్లో ప్రజలు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేయవచ్చని ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ తెలిపారు.

డిసెంబర్ 2న గ్రామ పంచాయతీ ఎన్నికలు

నందికొట్కూరు నియోజకవర్గంలో నందికొట్కూరు, మిడుతూరు, జూపాడుబంగ్లా,పగిడ్యాల పాములపాడు,కొత్తపల్లి ఈ ఆరు మండలాల్లో డిసెంబర్ 2 వ తేదీన మూడవ విడత ఎన్నికలు జరగనున్నాయి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *