NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా బాలల దినోత్సవం..

1 min read

ఘనంగా బాలల దినోత్సవం… సబికులను ఆలరించిన బాలల సాంస్కృతిక నృత్యాలు

న్యూస్ నేడు, పత్తికొండ:     పత్తికొండ స్థానిక శాంతి టాలెంట్ హై స్కూల్లో పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి , పాఠశాల వ్యవస్థాపకులు కొత్తపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు . మొదట స్వాతంత్ర్య సమరయోధుడు ,నవభారత నిర్మాత భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పిస్తూ,137 వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ జయంతి సందర్భంగా దేశానికి ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకున్నారు .ఈ సందర్భంగా  కొత్తపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, స్వచ్ఛమైన నవ్వు ,కల్మషం లేని మనసు ,అంతులేని ఆశలు ఇవే బాల్యానికి అసలైన ఆభరణాలనీ నెహ్రు  విశ్వసించారని ఆయన తెలిపారు. నెహ్రు గారికి చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టము.అందుకే  చిన్నారులు నెహ్రూను “చాచా నెహ్రు “అని పిలుస్తారని తెలిపారు. ఆయన జన్మదినాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీని” బాలల దినోత్సవం” గా జరుపుకుంటామని గుర్తు చేశారు.తోటలో వికసించే ప్రతి పువ్వును ఎంత ప్రేమతో, శ్రద్ధతో కాపాడు కుంటామో సమాజంలో ప్రతి చిన్నారిని అంతే భద్రంగా, ఆప్యాయంగా తీర్చిదిద్దాలని నెహ్రూ భావించారని ఆయన అన్నారు.ఆ మహనీయునీ  జన్మదినం సందర్భంగా దేశమంతా జరుపుకుంటున్న బాలల దినోత్సవం నేడు అని తెలిపారు. కేవలం పాఠశాలలో నిర్వహించే వేడుకలకే పరిమితం కాకూడదని, ఇది చిన్నారుల హక్కులను వారి స్వేచ్ఛను, శ్రేయస్సును పునరుద్ఘాటించే పవిత్రమైన దినమని ఆయన అన్నారు.. ప్రతి చిన్నారికి నిర్భయమైన ఆత్మవిశ్వాసంతో కూడిన జీవన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని  తెలియజేశారు. బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలని క్రీడలను నిర్వహించారు. క్రీడలలోను, సాంస్కృతిక కార్యక్రమాలు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *