ఫరూక్ శిబిలి విడుదల
1 min readపల్లెవెలుగు వెబ్, కడప బ్యూరో : భూముల విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ సెల్ఫీ వీడియో తీసి ఆవేదన వ్యక్తం చేసిన అక్బర్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మైనార్టీ పోరాట హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్ శిబిలి, జమే తుల్మా హింద్ జిల్లా కార్యదర్శి హుసేన్ మదురి పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిన విషయం తెలిసిందే. గురువారం కడప సెంట్రల్ జైలు రిమాండ్ నుంచి ఫరూక్ శిబిలి, హుసేన్ మదురి విడుదలయ్యారు. వారికి ముస్లిం మైనార్టీ సోదరులు ఘన స్వాగతం పలికారు.