PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘పరిషత్​’లో.. న్యాయమే గెలిచింది..

1 min read

– నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్
పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: పరిషత్​ ఎన్నికల రద్దు కోసం ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నం విఫలమైందని, అందు తగినట్టుగానే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్​. స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో‌ ఆదివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫలితాల తీరు చూస్తుంటే గతంలో వచ్చిన ఫలితాల కంటే అత్యధిక స్థానాలను వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుందన్నారు. ఈ ఫలితాలే సీఎం వైఎస్‌ జగన్‌ పాలనకు నిదర్శనమని అన్నారు. ఎన్నికలను బహిష్కరించాం అంటూనే టీడీపీ అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం చేసింది. కానీ, ఘోరమైన ఫలితాలు వస్తాయని ముందే తెలిసి పారిపోయిందని ఏద్దేవా చేశారు. కరోనా సాకు చూపి ఎన్నికలను వాయిదా వేసి ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేయాలని తెలుగుదేశం నాయకులు కుట్రలు పన్నినప్పటికి చివరికి న్యాయమే గెలిచింది అన్నారు. ప్రజలు వైసిపికి పట్టం కట్టారని అన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నారావారిపల్లెలో వైసీపీ అభ్యర్థి విజయ ఢంకా మోగించి 30ఏళ్ల రాజకీయ చరిత్ర తిరగ రాసింది అన్నారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే విజయంలో కీలక భూమిక పోషించాయన్నారు .బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సంక్షేమ ఫలాలకు తగినట్టుగా ఫలితాలు వచ్చాయని అన్నారు. ప్రజలంతా వైఎస్‌ జగన్‌ను గుండెల్లో పెట్టుకుని తీర్పునించారని అన్నారు.మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డను అడ్డుపెట్టుకుని కుట్ర చేయాలనుకున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. మున్సిపాలిటీ, పంచాయతీ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ తిరుగులేని మెజారిటీ సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నాయకుడు అయ్యన్నపాత్రుడు మాట్లాడిన భాష సరైంది కాదన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ఆయన మాటలు ఉన్నాయని మహిళలు దళితులు మహిళా మంత్రులు ముఖ్యమంత్రులు అంటే తెలుగుదేశం నాయకులకు మాత్రమే గౌరవం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలుగుదేశం నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని అయ్యన్నపాత్రుడు పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ అభ్యర్థుల విషయంలో కీలక భూమిక పోషించిన ప్రజలకు, వైసిపి అభిమానులకు, కార్యకర్తలకు ఆయా గ్రామాల నాయకులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ధర్మా రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరక్టర్ షుకూర్ మియ్య, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ రామ సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.

About Author