ఉత్తరాంధ్రాకు వాయుగుండం! నేడు, రేపు భారీవర్షసూచన
1 min readపల్లెవెలుగువెబ్, విశాఖపట్నం : ఉత్తరాంధ్రాకు వాయుగుండం పొంచి ఉందని, నేడు రేపు ఉత్తరాంధ్రా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం పశ్చిమ వాయువ్యంగా గంటకు 14కి.మీ. వేగంతో పయనిస్తోందని తెలిపింది. కళింగపట్నానికి తూర్పు దిశగా 660కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్న నేపథ్యంలో ఇది తీవ్ర వాయుగుండంగా మారి, పశ్చిమ వాయువ్యంగా పయనించి పశ్చిమ నైరుతి దశగా మార్పు చెంది ఆదివారం సాయంత్రానికి ఒడిసా, ఉత్తరాంధ్రాల మధ్య తీరం దాటుతుందని ఆ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రాలో పలుచోట్ల ఒక మోస్తరు భారీ వర్షాలు కురిసే వీలుదని, మరికొన్ని చోట్ల కుంభవృష్టిగా కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.