NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రకృతి వ్యవసాయంపై.. శిక్షణ

1 min read

నంద్యాల, న్యూస్​ నేడు: ప్రకృతి వ్యవసాయాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (ఏపీసియన్​ఎఫ్) ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో మూడు రోజుల జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ శిక్షణా కార్యక్రమం జూన్ 4 నుండి 6 వరకు నిర్వహించబడుతుంది.ఈ కార్యక్రమాన్ని డిపిఎంయు ,  ఏపీసియన్​ఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణలో రాష్ట్ర స్థాయి శిక్షకులు, జిల్లా స్థాయి శిక్షకులు, మరియు డిపిఎంయు సిబ్బంది పాల్గొన్నారు.మొదటి రోజు ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ, “ప్రతి గ్రామ రైతు పిఎండిఎస్​ పంటను అవలంబించి, ఏ-గ్రేడ్ మరియు ఏటీఎం మోడల్స్ అమలు చేయాలి. దీని ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గి దిగుబడులు పెరుగుతాయి. డివిజన్ స్థాయిలో నిర్వహించే శిక్షణల సమయంలో ప్రకృతి వ్యవసాయ మోడల్స్‌పై సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించాలి” అన్నారు.జిల్లా ఉద్యానవన అధికారి నాగరాజ్ మాట్లాడుతూ, “ఉద్యాన పంటలలోనూ పిఎండిఎస్​ పద్ధతులు అమలు చేయడం ద్వారా రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మరింతగా ఆకర్షించవచ్చు. ఇది జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది” అన్నారు.

About Author