NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీ ఆధ్వర్యంలో… ‘ వెన్నుపోటు ‘ దినం

1 min read

ఎన్నికల లో హామీ ఇచ్చి… ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం..

వెంటనే హామీ లు అమలు చేయాలి

వైసీపీ కర్నూలు పార్లమెంట్  అధ్యక్షులు  ఎస్ వి మోహన్ రెడ్డి

కర్నూలు, న్యూస్ నేడు : ఎన్నికల్లో 143 సూపర్ సిక్స్ లాంటి పథకాలు ఇస్తానని చెప్పి….  అధికారం లోకి వచ్చి సంవత్సరం గడిచినా ఒకటి అమలు చేయలేని అసమర్థ కూటమి ప్రభుత్వమని వైసీపీ కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఎస్ వి మోహన్ రెడ్డి ధ్వజమెత్తా రు.  బుధవారం వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతం ఐ నది.   నగరం లోని ఎస్ వి కాంప్లెక్స్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్ వి మోహన్ రెడ్డి ,  మాజీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ..ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి వర్గం  మహిళలు, రైతులు, నిరుద్యోగ యువత, బడుగు బలహీన వర్గాలు  ఈ ప్రభుత్వ పాలన వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వాడుకున్న తరువాత మరిచిపోయి, ప్రజల విశ్వాసాన్ని ద్రోహించారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి  నాయకత్వంలో మన ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే కాకుండా, సామాజిక సాధికారత, మంచి పాలన, రాష్ట్ర అభివృద్ధిను ప్రధాన అజెండాగా తీసుకుని ముందుకు నడిపింది. ప్రజల అభ్యున్నతికి, సమానత్వానికి, సంక్షేమానికి పునాది వేసిన మన ప్రభుత్వం తరహా పాలనను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది.

About Author