వాయుగుండం ప్రభావం.. రైళ్లు రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే!
1 min readపల్లెవెలుగువెబ్, హైదరాబాద్: ఒడిసా–ఉత్తరాంధ్రా మధ్యలో నెలకొన్న వాయుగుండం గులాబ్ తుఫాన్‌గా మారింది. ఈ ప్రభావం కారణంగా ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో దక్షిణమధ్య రైల్వేశాఖ ఆదివారం పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈసాయంత్రం తుఫాన్ బలపడి కలింగపట్నం, గోపాలపూర్ మధ్య పశ్చిమ దిశ నుంచి ఉత్తరం దిశగా తీరాన్నిదాటుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కురిసే అతిభారీవర్ష సూచనతో రైల్వేశాఖ రైళ్ల రాకపోకలను అర్థాంతంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో ప్రధానంగా భువనేశ్వర్–సికింద్రాబాద్, భువనేశ్వర్–తిరుపతి, రాయగడ్–గుంటూరు, భువనేశ్వర్–కేఎన్ఆర్బెంగుళూరు, భువనేశ్వర్–యశ్వంత్‌పూర్, పూరి–చెన్నైసెంట్రల్, సంబల్పూర్–హెచ్ఎన్నాందేడ్ రైళ్లతోపాటు మరికొన్నిరైళ్ల రాకపోకలను నిలిపివేసింది.
ఇదిలా ఉండగా… ఆంధ్రప్రదేశ్‌లో గులాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఈక్రమంలో ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ దృష్ట్యా అక్కడి పరిస్థితులపై ఏపీ సీఎం జగన్‌తో మాట్లాడారు. కేంద్రం నుంచి సహాయసహకారాలు ఉంటాయని సీఎంకు భరోసా ఇచ్చారు.