రాయలసీమ అభివృద్ధి కోసం.. శ్రీ బాగ్ ఒప్పందం అమలు చేయాల్సిందే…
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు : రాయలసీమ అభివృద్ధి కోసం శ్రీ బాగ్ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేశారు రాయలసీమ విద్యావంతుల ఐక్య వేదిక రాష్ట్ర బాధ్యులు అరుణ్, విజయ భాస్కర్ రెడ్డి, రైతుకూలీ సంఘం నాయకులు సుంకన్న. శ్రీభాగ్ ఒప్పందం అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంను నవంబరు 1 కి బదులు అక్టోబరు 1న ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని, కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలు లో ఏర్పాటు చేయాలని, G.O. నం. 69 ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో DTF బాధ్యులు రత్నం ఏసేపు, బుడగ జంగం సంక్షేమ సంఘం నాయకులు తుర్పాటీ మనోహర్, రాయలసీమ యునైటెడ్ విద్యార్థి సంఘం నాయకులు కోనేటి వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘం నాయకులు భాస్కర నాయుడు, పౌర హక్కుల సంఘం నాయకులు అల్లా బాకష్, BCSF రాష్ట్ర నాయకులు మోహన్ BSNL ఉద్యోగుల సంఘం నాయకులు,JTO శ్రీనివాసులు, పాల్గొన్నారు.