హుకుంపేటలో పవన్‌కళ్యాణ్ శ్రమదానానికి నాంది!
1 min readపల్లవెలుగువెబ్, రాజమండ్రి: రాజమండ్రిలోని హుకుంపేటలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రోడ్ల దుస్థితిపై ఉద్యమ స్ఫూర్తితో శ్రమదాన కార్యక్రమానికి నాంది పలికారు. ముందుగా శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనేందుకు హుకుంపేటకు చేరుకున్న పవన్‌కళ్యాణ్‌కు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రాష్ట్ర రహదారుల విషయంలో జనసేన చేపట్టిన ఉద్యమానికి జనసేన సైనికులు కదిలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సాగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నిరంకుశ పాలనసాగుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కులప్రాతిపదిక రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ కాపు, తెలగ, బలిజ వంటి వర్గాలు రాజకీయ ఎదుగుదలతో పురోగతి సాధించాలని, అప్పుడే రాజ్యాదికారం సాధ్యమవుతుందని అన్నారు. 2014లో కాపు ఉద్యమాన్ని అణిచివేస్తే నిలువరించలేపపోయారన్న విషయాన్ని గుర్తు చేశారు. కులపెద్దలు, నాయకులు కలిసి ఎక్కడ తప్పులు చేశాం, ఎవరి చేతిలో మోసపోయాం అనే అంశాలపై సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాపువర్గాలు కలిసికట్టుగా ముందుకొస్తే తప్ప శెట్టిబలిజలు, కొప్పుల వెలమ, తూర్పుకాపు, దళితులు, మైనార్టీలు ముందుకురారంటూనే తాను కమ్మవర్గానికి వ్యతిరేకం కాదన్నట్లుగా టిడిపికి మద్దతుగా నిలిచానన్నారు. రాష్ట్రంలో వైసీపీని ఎదుర్కోవడం టిడిపి వల్ల కావడం లేదని, అందుకే జనసేన వచ్చందని పేర్కొన్నారు. తుదిశ్వాస వదిలేదాకా రాజకీయాల్లోనే ఉంటానని మాటిస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ నేతలు యుద్ధానికి సిద్ధం కావాలని హెచ్చరించారు. వైసీపీ ఏస్థాయిలో కురుకుంటే ఆ స్థాయిలో తాను యుద్ధానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఏదేమైనా హుకుంపేటలో పోలీసుబందోబస్తు నడుమ పవన్‌కళ్యాణ్ శ్రమదాన కార్యక్రమం ఉత్కంఠ భరితంగా సాగింది.