బద్వేల్ ఉప ఎన్నిక నుంచి టీడీపీ నిష్ర్కమణ!
1 min readపల్లెవెలుగువెబ్, అమరావతి: కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల నుంచి టీడీపీ వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఆదివారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్‌ను ప్రకటించిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దివంగత వెంకటసుబ్బయ్య పట్ల అనుభూతిని పరిగణలోకి తీసుకుని ఆయన సతీమణి డాక్టర్ సుధా ఎంపిక మద్దతుగా ఉప ఎన్నిక నుంచి వైదొలగడం విశేషం. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి బద్వేల్ ఎన్నికను ఏకగ్రీవం అయ్యేందుకు అన్నిపార్టీలు సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలపడం లేదని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో టీడీపీ సైతం అదే బాటలో పోటీనుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. కాగా బీజేపీ మాత్రం తమ అభ్యర్థిని బరిలో దించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు బద్వేల్ బరిలో ఉంటున్నట్లు వెల్లడించారు.