PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతాంగానికి సాగునీరు ఇబ్బంది ఉండదు.. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని

1 min read

పల్లెవెలుగువెబ్​, గడివేముల: పాణ్యం నియోజకవర్గంలోని రైతాంగానికి సాగునీరు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​రెడ్డి అన్నారు. రైతులను అన్నివిధాల అదుకుంటామన్నారు. ఆదివారం మంచాలకట్ట గ్రామ పరిధిలోని ఎస్​ఆర్​బీసీ కాల్వ నుంచి ఎత్తిపోతల ద్వారా మంచాలకట్ట చెరువుకు నీటిని తరలించేందుకు రూ.2కోట్లతో ఏర్పాటు చేసిన మోటార్లను ఎమ్మెల్యే కాటసాని సోలార్​ సీఈవో రమణారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ ఆయకట్టు రైతులకు సాగునీరు అందేలా రెండు కొత్త మోటర్లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే శిథిలమైన పైప్​లైన్​ను తొలగించి కొత్త పైప్​లైన్​ వేస్తామన్నారు. రైతులకు నీరు అందించేందుకు గని పరిసర ప్రాంతాల్లో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో కొత్త రిజర్వాయర్ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గని చెరువు కాల్వకు తూము ఏర్పాటు చేసి రైతులకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో అదనంగా 500 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఎస్​ఆర్​బీసీ నుంచి మద్దిలేరు వాగుకు తూములు ఏర్పాటు విషయమై ముఖ్యమంత్రిని వనతిప్రతం ద్వారా కోరినట్లు తెలిపారు. చెరువుపైన కంపను తొలగించేందుకు ఇరిగేషన్ అధికారులతో చర్చించామన్నారు. కార్యక్రమంలో సోలార్ ఏడి సురేఖరెడ్డి. జెడ్పీటీసీ సభ్యులు ఆర్​.బి.చంద్రశేఖర్​రెడ్డి, వైసిపి నాయకులు అనిల్​కుమార్ రెడ్డి, మేఘనాథ్ రెడ్డి గని ఆనంద్ రెడ్డి , సింగిల్​ విండో చైర్మన్ శేఖర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రామలింగేశ్వర రెడ్డి, చిందుకురు వెంకట కృష్ణారెడ్డి, రవీంద్రారెడ్డి , కరిమద్దుల పుల్లయ్య, డాలు స్వామి, కాలు నాయక్, సర్పంచ్ మాలిక్ బాషా, ఎంపిటిసి మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author