దేవీశరన్నవరాత్రోత్సవాలకు ముస్తాబయిన ఇంద్రకిలాద్రి!
1 min read
పల్లెవెలుగువెబ్, విజయవాడ: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన దుర్గమ్మ సన్నిది ఇంద్రకిలాద్రి దేవీశరన్నవరాత్రోత్సవాలకు ముస్తాబయింది. దసరా మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నవరాత్రోత్సవాలను వైభవోతంగా నిర్వహిస్తారు. దేవస్థానం అధికారులు ఉత్సవాల నిర్వహణకు ముందస్తు ఏర్పాటు సిద్ధం చేశారు. దుర్గామల్లేశ్వరస్వామివార్ల ఉభయదేవాలయాలను రంగురంగుల విద్యద్దీపాలంకరణతో తీర్చిదిద్దారు. తొమ్మిదిరోజులపాటు కొనసాగే దసరా ఉత్సవాల్లో దుర్గాదేవి రోజుకు ఒక రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారం, బాలా త్రిపురసుందరీదేవి, గాయత్రిదేవి, అన్నపూర్ణదేవి, లలితా త్రిపురసుందరిదేవి, మహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దినిదేవి, రాజరాజేశ్వరిదేవి అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు.