గూడూరులో .. వైసీపీ జెండా
1 min readవైసీపీ 12 , – టీడీపీ 3, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థులు నలుగురు విజేత
పల్లెవెలుగు, గూడురు
గూడూరు నగర పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపు ఫలితాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఆదివారం కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ లో గూడూరు నగర పంచాయతీ 20 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 04 స్థానాలు, తెలుగుదేశం పార్టీ 03, భారతీయ జనతా పార్టీ 01 స్థానం కైవసం చేసుకుంది. గూడూరు నగర పంచాయతీ కి జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారు. అయితే తెలుగుదేశం పార్టీ 20 వార్డులకు పోటీ చేసి కేవలం 03 స్థానాలకే పరిమితమైంది. స్వతంత్ర అభ్యర్థులు 11 మంది బరిలో నిలువగా నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నారు.
వైసీపీ శ్రేణుల సంబరాలు
నగర పంచాయతీ ఎన్నికలో వైసీపీ జెండా రెపరెపలాడటంతో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్ వెంకటేశ్వర్లు, జిలాని, జానీ, సంజయ్, దస్తగిరి, కుమార్, విజయుడు, ఆధ్వర్యంలో కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ డాక్టర్ సుధాకర్ నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థి జులపాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ అభ్యర్థి అస్లాంను భారీ గజమాలతో సత్కరించి సంబరాలను జరుపుకున్నారు. అనంతరం పాత్రికేయులతో కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలను ఇచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
వార్డు, విజేతల వివరాలు..
1వార్డు – స్వతంత్ర అభ్యర్థి(మల్లాపు బుడ్డ అంగిలి)…46 ఓట్ల మెజారిటీతో
2వార్డు – స్వతంత్ర అభ్యర్థి (బోజుగు కర్ణాకర్ రాజు) 207 మెజారిటీ తో గెలుపు
3వార్డు – వైసిపి (సంగి పోగు మౌనిక) 47 ఓట్ల మెజారిటీతో గెలుపు.
4వార్డు – వైసిపి (గోనెగండ్ల బోయ లక్ష్మన్న) 137 ఓట్లతో మెజారిటీ.
5వార్డు – వైసిపి (బోయఉరుకుందమ్మ) 146 ఓట్ల మెజారిటీతో గెలుపు.
6వార్డు – వైసిపి (మూల గేరి దస్తగిరి) 158 ఓట్లతో గెలుపు.
7వార్డు – వైసిపి (మండ్ల రత్నమ్మ) 50 ఓట్ల మెజారిటీ తో గెలుపు.
8వార్డు – వైసిపి (గోకులపాడు పద్మావతి) 82 ఓట్ల మెజారిటీతో గెలుపు.
9వార్డు – టిడిపి (బందెల కాజా మున్ని) 14 ఓట్ల మెజారిటీతో గెలుపు.
10వార్డు – టిడిపి (రేమట ఊరు వాకిలి సురేష్) 150 ఓట్ల మెజారిటీతో గెలుపు.
11వార్డు – వైసిపి (బోయ మల్లేశ్వరి) 335 ఓట్ల మెజారిటీ తో గెలుపు.
12వార్డు – వైసిపి (పి ఎన్. అస్లాం) 378 ఓట్ల మెజారిటీతో గెలుపు.
13వార్డు – వైసిపి (బెన్నీ జ్యోతి) 114 ఓట్ల మెజారిటీతో గెలుపు.
14వార్డు – టిడిపి (కుమ్మరి ఎల్లానాగమ్మ) 20 ఓట్ల మెజారిటీతో గెలుపు.
15వార్డు – స్వతంత్ర అభ్యర్థిని (గనుమల పద్మావతమ్మ) 64 ఓట్ల మెజారిటీతో గెలుపు.
16వార్డు – బిజెపి (డమము శకుంతలమ్మ) 09 ఓట్ల మెజారిటీతో గెలుపు.
17వార్డు – స్వతంత్ర అభ్యర్థి (మండల బజారి) 94 ఓట్ల మెజారిటీతో గెలుపు.
18వార్డు – వైసిపి (షేక్ కలాం భాష) 353 ఓట్ల మెజారిటీతో గెలుపు.
19వార్డు – వైసిపి (షేక్ ఖలీల్ భాషా) 292 ఓట్ల మెజారిటీతో గెలుపు.
20వార్డు – వైసిపి (జులపాల వెంకటేశ్వర్లు) 301 ఓట్ల మెజారిటీతో గెలుపు
సంబరాలు జరుపుకుంటున్న వైసీపీ శ్రేణులు