బాయ్ కాట్ 996 !
1 min readపల్లెవెలుగు వెబ్ : చైనాలో కొత్త ఉద్యమం మొదలైంది. అమెరికా సహా పలు దేశాల్లో ది గ్రేట్ రిజిగ్నేషన్ ఉద్యమం మొదలవుతుంటే.. చైనాలో 996 కల్చర్ కి వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. ఓవర్ టైం పనివేళలు, వీక్ ఆఫ్స్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వారు పనిచేస్తున్న కంపెనీల పనివివరాలు ఆన్ లైన్ లో పొందుపరుస్తున్నారు. ఇలా ఒక డేటా బేస్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులు వారి వివరాలు నమోదు చేశారు. వీటిలో అలీబాబా గ్రూప్, బైడూ, టెన్సెంట్, బైట్ డాన్స్ వంటి చైనా ప్ముఖ సంస్థల ఉద్యోగులు ఉన్నారు.
996 అంటే..
పనివేళలు.. రోజుల సంఖ్యను సూచించేదే 996. ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.. వారంలో 6 రోజుల పాటు పనిచేస్తున్నారు. దీన్నే 996గా పేర్కొంటున్నారు. చైనాలోని అధిక పనిగంటలపై ఆందోళన వ్యక్తమవుతోంది. 996 కల్చర్ ని నిషేధించి.. 955 కల్చర్ తీసుకురావాలని కోరుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. 5 రోజులు పని దినాలు ఉండే విధంగా తీసుకురావాలని కోరుతున్నారు. ఈ ఉద్యమం ద్వార అయినా కంపెనీలు ఈ విషయం పై దృష్టిసారిస్తాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.