NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

థియేట‌ర్లు బంద్ చేయండి : ముఖ్యమంత్రి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌ర్ణాట‌క వ్యాప్తంగా సినిమా థియేట‌ర్లు బంద్ చేయాల‌ని క‌ర్ణాట‌క సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై ఆదేశించారు. ప్ర‌ముఖ క‌న్న‌డ హీరో పునీత్ రాజ్ కుమార్ కు గుండెపోటు రావ‌డంతో ఆయ‌న‌ను ఆస్పత్రికి త‌ర‌లించారు. ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక వైద్యుల బృందం ఐసీయూలో చికిత్స అందిస్తోంది. ఈ నేప‌థ్యంలో క‌ర్ణాట‌క వ్యాప్తంగా భారీ పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. పునీత్ రాజ్ కుమార్ చికిత్స పొందుతున్న ఆస్పత్రి వ‌ద్ద కూడ భారీగా పోలీసులు మోహ‌రించారు. చికిత్స పొందుతూ పునీత్​ రాజ్​ కుమార్​ తుది శ్వాస విడిచారు. ..ఈ నేప‌థ్యంలో సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై థియేట‌ర్లు బంద్ చేయాల‌ని ఆదేశించారు.

About Author