ఇక నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు !?
1 min readపల్లెవెలుగు వెబ్: కొన్ని ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. పాత ఓఎస్ వెర్షన్లతో నడుస్తున్న కొన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్, కేఏఐఓస్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఆ ఫోన్లు ఉన్న వారు వాట్సాప్ సేవలు పొందాలంటే తప్పకుండా కొత్త ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు అన్ని చాట్లను కొత్త ఫోన్ కొనడానికి ముందు బ్యాకప్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఆండ్రాయిడ్ 4.0.4, పాత వెర్షన్లలో రన్ అయ్యే ఫోన్లో వాట్సప్ మెసేజింగ్ అప్లికేషన్‌కు పనిచేయదు. సామ్సంగ్ గెలాక్సీ ఎస్II, గెలాక్సీ ఎస్3 మిని, ఆప్టిమస్ ఎల్5 డ్యూయాల్, ఆప్టిమస్ ఎల్4 ఐఐ డ్యూయల్, ఆప్టిమస్ ఎఫ్7, ఆప్టిమస్ ఎఫ్5 ఫోన్లలో వాట్సప్ నిలిచిపోనుంది. వినియోగదారులు కొత్త ఫోన్ లను కొనుగోలు చేస్తేనే ఆయా ఫోన్లలో వాట్సాప్ పనిచేస్తుంది.