NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘బిబి3’లో.. బాలయ్య లుక్ మారుతోందా..

1 min read

సింహా’, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య – బోయపాటి కాంబోలో వస్తున్న ‘బిబి3’ సినిమా మీద నందమూరి అభిమానుల్లో.. ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగాయి. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా.. పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. బిబి3 ఫస్ట్ రోల్​ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాడు బోయపాటి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తుండగా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతుండగా.. లుక్ ఫస్ట్ రోర్‌లో చూపించాడు బోయపాటి. కాగా రెండవ లుక్ ఎలా ఉంటుందన్నది ఇంకా రివీల్ చేయలేదు. అఘోరా గెటప్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ అభిమానులను దృష్టిలో పెట్టుకున్న బోయపాటి అఘోరా గెటప్‌లో బాలయ్యని చూడటానికి ఇష్టపడరన్న సందేహం కలగడంతో కొత్తరకమైన మేకోవర్‌ని చేస్తున్నటు తాజా సమాచారం. కాగా ఈ కొత్త మేకోవర్‌తో చిత్రీకరించాల్సిన సీన్స్‌ని త్వరలో తెరకెక్కిస్తాడని తెలుస్తోది. ఇక బిబి3 ఈ ఏడాది మే 28న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

About Author