సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో చెప్పిన రామ్ చరణ్
1 min readపల్లెవెలుగువెబ్ : సినిమాలు నిర్మాతలకు నష్టాలను మిగల్చడంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా స్పందించారు. ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాలు ఫెయిలవడానికి కారణమేంటని ప్రశ్నించిన విలేకరులకు జవాబిచ్చారు. కథలో బలంలేకపోవడం వల్లే సినిమాలు ఆడట్లేదని రామ్ చరణ్ తేల్చేశారు. మంచి కథలను ప్రేక్షకులు ఎప్పుడైనా సరే ఆదరిస్తూనే ఉంటారని చెప్పారు. ఆర్ఆర్ఆర్ తర్వాత అతిథి పాత్రలో నటించిన ఆచార్య సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో స్క్రిప్ట్ నుంచి మేకింగ్ వరకు అన్నింటిపైనా ఎగ్జిబిటర్ పునరాలోచించుకోవాలని రామ్ చరణ్ సూచించారు. సినిమా నిర్మాణ ఖర్చును తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం తమ రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నట్లు ఆయన వివరించారు. మరోవైపు, థియేటర్లలో పాప్ కార్న్, సమోసాలతో పాటు అన్నింటి రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు.