రెండు వేల కోసం.. స్నేహితుడి గొంతు కోసి.. !
1 min readపల్లెవెలుగు వెబ్: హైదరాబాద్ లో దారుణం జరిగింది. స్నేహితుడనే కనికరం లేకుండా గొంతు కోసి హత్య చేశాడు. అది కూడ కేవలం రూ. 2 వేల కోసమే. ఈ ఘటన ముషీరాబాద్ లోని ఫకిర్ వాడలో జరిగింది. ఫకిర్ వాడలో నివాసం ఉండే అల్తాఫ్ ఖాన్ తన స్నేహితుడు సోనుకు రెండు వేలు ఇచ్చాడు. సోను తీసుకున్న అప్పు చెల్లించలేకపోయాడు. దీంతో కోపంతో ఊగిపోయిన అల్తాఫ్ ఖాన్ సోనును గొంతుకోసి హత్య చేశాడు ఈ ఘటనతో ఫకిర్ వాడ ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.