ఆర్థిక సంక్షోభంలో ఆప్ఘనిస్తాన్.. అమెరికానే కారణం: తాలిబన్లు
1 min read
పల్లెవెలుగు వెబ్: ఆప్ఘనిస్తాన్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లాక.. అక్కడ తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఆప్ఘన్ సెంట్రల్ బ్యాంకు సంబంధించి 66 వేల కోట్ల నిధులను అమెరికా స్తంభింపజేసింది. దీంతో నిధులు లేక ఆప్ఘన్ విలవిలాడుతోంది. మరికొన్ని రోజులు ఇలానే కొనసాగితే అక్కడ తీవ్రమైన ఆహార కొరత ఏర్పడనుంది. దీంతో ఇతర దేశాలకు ఆప్ఘన్ నుంచి భారీగా వలసలు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక సంక్షోభంపై తాలిబన్లు స్పందించారు. అమెరికా చర్యలు తమకు ఆశ్చర్యం కలిగించాయన్నారు. ఇది దోహా ఇప్పందానికి విరుద్ధమని ఆప్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ అన్నారు.