సీఎం నిర్ణయం.. హర్షణీయం..: కురువ సంఘం
1 min readపల్లెవెలుగు వెబ్: శ్రీ శ్రీ భక్త కనకదాసు జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తేదీ 22-11-2021 సోమవారం అధికారికంగా నిర్వహించాలని సిఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని, ఆయన నిర్ణయం హర్షణీయమన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శివన్న ,జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి ఎం .దేవేంద్రప్ప ,ఎం .కే .రంగస్వామి. కురువ కులస్థుల అరాద్యదైవం శ్రీ భక్త కనకదాసు జయంతి అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తేలియజేస్తున్నాం. రాష్ట్రంలో 35 లక్షలు జనాభా ఉన్న కురువలకు రావాల్సిన పదువులు కేటాయించాలని కోరారు. ఈ సమావేశం లో జిల్లా ఉపాధ్యక్షుడు బి .వెంకటేశ్వర్లు ,కోశాధికారి కే .సి .నాగన్న ,జిల్లా నాయకులు బి .సి .తిరుపాల్ ,శ్రీరాములు ,పాలసుంకన్న ,వెంకటకృష్ణ ,నగర సంఘం అధ్యక్ష ,కార్యదరి తవుడు శ్రీనివాసులు ,బి .రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు .