దుర్గా భోగేశ్వరుడి పాదాలను తాకిన సూర్యకిరణాలు..
1 min readపల్లెవెలుగు వెబ్. గడివేముల: ప్రతి ఏటా కార్తీక మాసం మూడవ వారంలో ఉదయం 6 .45 గంటలకు ఏకధాటిగా 15 రోజుల పాటు ఆలయ గర్భ గుడిలో స్వామివారి పాదాలను సూర్యుడు తాకుతాడని ఆలయ అర్చకులు శ్యాంసుందర్ శర్మ తెలిపారు. కొద్ది సమయంలో మాత్రమే సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకడంతో… ఈ అద్బుతమైన దృశ్యాన్ని భక్తులు తిలకించవచ్చు. ఉత్తర కాశీ గా పేరుపొందిన దుర్గ భోగేశ్వర స్వామి ఆలయంలో ఎక్కడా లేనటువంటి కాల భైరవ స్వామి ఆలయం ఉండటం ఇక్కడి ప్రత్యేకత.