నష్టాల్లో స్టాక్ మార్కెట్
1 min readస్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది. గత వారం లాగే ఈ వారం కూడ నష్టాలతో మొదలైంది. ప్రపంచ మార్కెట్ల ఒడిదుడుకులతో దేశియా మార్కెట్లు కూడ అదే బాటలో పయనిస్తున్నాయి. నష్టాలతో ప్రారంభమై.. కన్సాలిడేషన్ అవుతున్నాయి. అమెరికా బాండ్ ఈల్డ్స్ స్థిరపడటం, ప్రపంచ వ్యాప్తంగా కరోనావ్యాప్తి మరోసారి పెరగడంతో.. కీలకమైన బ్యాంకింగ్, మరియు ఆర్థిక రంగ షేర్లు డీలా పడటంతో మార్కెట్ నష్టాల్లో పయనిస్తోంది. ఉదయం 11.30 సయంలో బ్యాంక్ నిఫ్టీ 320 పాయింట్లు నష్టపోయి.. 33800 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 60 పాయింట్లు నష్టపోయి..14680 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు కనుక కొనసాగితే.. మరింతగా స్టాక్ మార్కెట్ నష్టపోయే ప్రమాదం ఉంది.