కిలో టీ పొడి ధర.. రూ. 99,999 !
1 min readపల్లెవెలుగు వెబ్: మన దేశంలో చాయ్ కు ఉన్న ప్రత్యేకత వేరు. వివిధ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల అభిరుచి, రుచికి అనుగుణంగా టీని తయారు చేస్తారు. కానీ అస్సాంలో ఉత్పత్తి అయ్యే టీ పొడికి, టీకి ఎంతో ప్రత్యేకత ఉంది. అస్సాంలో ఉత్పత్తి అయ్యే పలురకాల టీపొడులను అక్కడ వేలం వేస్తారు. గతంలో టీ పొడులు రూ. 50 వేలు, రూ. 75 వేలు వేలంలో పలకగా.. ఈ సంవత్సరం మనోహరి గోల్డ్ టీ రికార్డు స్థాయి ధరను సొంతం చేసుకుంది. కిలో టీ పొడి 99,999 రూపాయలు వేలం ధర పలికింది. ఈ గోల్డ్ టీపొడిని మనోహరి టీ ఎస్టేట్స్ నుంచి సౌరవ్ టీ ట్రేడర్స్ అనే సంస్థ కొనుగోలు చేసింది. టీ పొడి కొనుగోలు, విక్రయాల్లో ఇదే అత్యధిక ధర.