వైఎస్ అనుచరుడు సూరీడు పై దాడి
1 min readహైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడు, వ్యక్తిగత సహాయకుడు సూరీడు మీద దాడి జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్న సూరీడు మీద .. ఆయన అల్లుడు సురేంద్రనాథ్ రెడ్డి క్రికెట్ బ్యాట్ తో విచక్షణారహితంగా దాడి చేశారు. ఇంట్లో కుటుంబసభ్యులు అడ్డుకొని.. సురేంద్రనాథ్ రెడ్డిని బయటికి నెట్టేశారు. అనంతరం తీవ్రంగా గాయపడిన సూరీడుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దాడికి కటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. సూరీడు కూతురు గంగా భవాని కొంతకాలంగా ఆయన ఇంట్లో నే ఉంటోంది. గతంలో సురేంద్రనాథ్ రెడ్డి మీద గృహహింస కేసు కూడ నమోదైంది. ఈ నేపథ్యంలోనే కేసు విత్ డ్రా చేసుకోవాలని సురేంద్రనాథ్ రెడ్డి .. సూరీడు కూతురు మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కేసు విత్ డ్రా చేసుకోవడానికి నిరాకరించడంతో .. ఆగ్రహించిన సురేంద్రనాథ్ రెడ్డి సూరీడు మీద దాడి చేసినట్టు తెలుస్తోంది.