ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్.. ఖాతాదారులకు చేదువార్త !
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తన ఖాతాదారులకు చేదువార్త తెలిపింది. ఉచితంగా అందిస్తున్న డిపాజిట్, విత్ డ్రా సేవలకు ఇక నుంచి చార్జీలు వసూలు చేయనుంది. 2022 జనవరి 1 నుంచి చార్జీలు వర్తిస్తాయి. బ్యాంకు అందించే ఉచిత లావాదేవీల పరిమితి అధిగమించాక.. చార్జీలు వసూలు చేయనున్నట్టు బ్యాంకు తెలిపింది. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులకు ప్రతి నెల ఉచితంగా 4 లావాదేవీలు చేయవచ్చు, ఆ తర్వాత ప్రతి విత్ డ్రా లావాదేవీకి దాని విలువలో 0.50%(కనీసం రూ.25) ఛార్జీల రూపంలో వసూలు చేయనుంది. ఈ ఖాతాదారులకు క్యాష్ డిపాజిట్ చేసుకోవడం ఉచితం. ఎలాంటి ఛార్జీలు ఉండవు.