మల్టీలెవెల్ మార్కెటింగ్ పై నిషేధం…కేంద్రం కీలక ఆదేశాలు
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం మల్టీలెవెల్ మార్కెటింగ్ పై నిషేధం విధించింది. కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాలు నిర్వహించే కంపెనీలు 90 రోజుల్లోగా కొత్త నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. మన దేశంలో తమ వస్తు, సేవలు విక్రయించే విదేశీ కంపెనీలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ కంపెనీల ఏజెంట్లు అమ్మే వస్తువులు, సేవలతో వినియోగదారులకు తలెత్తే సమస్యల పరిష్కార బాధ్యత కూడా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలదేనని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులు ఉల్లంఘించే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలపై చర్యలు తప్పవని కూడా ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నిషేధం ప్రభావం టప్పర్‌వేర్, ఆమ్వే, ఓరిఫ్లేమ్ వంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలపై ఉంటుందని భావిస్తున్నారు.