NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టికెట్ల పై ఉన్న శ్ర‌ద్ధ ప్ర‌జ‌ల పై లేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ ప్ర‌భుత్వానికి సినిమా టికెట్ల పై ఉన్న శ్ర‌ద్ధ ప్ర‌జ‌ల పై లేద‌ని టీడీపీ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర ధ్వ‌జ‌మెత్తారు. వైకాపా అస‌మ‌ర్థ పాల‌న వ‌ల్లే ఏపీ ఆర్థిక వ్య‌వ‌స్థ ఇబ్బందుల్లో ఉంద‌ని అన్నారు. ఇళ్ల ప‌ట్టాల పేరుతో ఏపీ ప్ర‌భుత్వం దోపిడీకి పాల్ప‌డుతోంద‌ని విమ‌ర్శించారు. వైకాపా దోపిడీ పై విచార‌ణ‌కు సిద్ధ‌మా ? అని స‌వాల్ విసిరారు. మూడు వేల పించ‌ను ఇస్తానన్న ప్ర‌భుత్వం.. ఇప్పుడు విడ‌త‌ల వారీగా అంటూ మాట త‌ప్పింద‌న్నారు. పించ‌న్ల పై ప్ర‌భుత్వం శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌న్నారు. క‌క్ష‌సాధింపులో భాగంగా అర్హుల‌కు ప‌థ‌కాలు ర‌ద్దు చేస్తున్నార‌ని ఆరోపించారు.

                                        

About Author