PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యాక్సిన్ తీసుకున్నా.. క‌రోన సోక‌డానికి కార‌ణం ఏంటంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న‌వారు కూడ క‌రోన బారిప‌డుతున్న సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో చాలా మంది వ్యాక్సిన్ల ప‌నితీరు పై ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ల ప‌నితీరు పై అనుమాన ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని అమెరికాలో మిన్నెసోటా విశ్వ‌విద్యాల‌యం ప‌రిశోధ‌కుడు లూయిస్ మాన్ స్కీ చెబుతున్నారు. క‌రోన బారిన ప‌డ‌టానికి మొద‌టి కార‌ణం .. వ్యాధి తీవ్ర‌త అధికంగా ఉన్న ఒమిక్రాన్ పుట్టుకు రావ‌డమ‌ని, రెండో కార‌ణం చాలా ప్రాంతాల్లో సెల‌వులు మొద‌లై ప్ర‌యాణాలు పెర‌గ‌డ‌మ‌ని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకుంటే త‌మ‌కు క‌రోన సోక‌ద‌ని చాలా మంది అపోహ ప‌డుతున్నార‌ని అన్నారు. క‌రోన బారిన‌ప‌డిన‌ప్ప‌టికీ తీవ్ర అనారోగ్యానికి గురికాకుండా ఉండేలా చూసే విధంగా వ్యాక్సిన్ త‌యారు చేశార‌ని ఆయ‌న తెలిపారు. వ్యాక్సిన్లు త‌మ ప‌నిని విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తున్నాయ‌ని తెలిపారు.

                                         

About Author