NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైలంలో… 12 నుంచి మకర సంక్రాంతి మహోత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని జనవరి 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పంచాహ్నికదీక్షతో ఏడురోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 18వ తేదీన ముగియనున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించి శ్రీ మల్లికార్జునస్వామివారికి ఏటా రెండుసార్లు అనగా మకర సంక్రమణం. సందర్భంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మరియు మహాశివరాత్రి సందర్భంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

బ్రహ్మోత్సవ కార్యక్రమాలు :

ఈ బ్రహ్మోత్సవాల ప్రారంభంగా 12.01.2022 ఉదయం గం.9.15లకు శ్రీస్వామివారి యాగశాల ప్రవేశ కార్యక్రమం నిర్వహించబడుతుంది. తరువాత వేదపండితులు చతుర్వేద పఠనాన్ని చేయడం జరుగుతుంది. అనంతరం లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు. సంకల్ప పఠనం తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ జరిపించబడుతుంది. గణపతి పూజ. ఈ కార్యక్రమాల తరువాత బ్రహ్మోత్సవ నిర్వహణకు అధ్వర్యం వహించే శివపరివార దేవుడైన చండీశ్వరునికి విశేషపూజలు జరిపించబడతాయి. అనంతరం కంకణధారణ, ఋత్విగ్వరణం, అఖండదీపారాధన, వాస్తుపూజ, వాస్తు హోమం, మండపారాధనలు, కలశస్థాపన, పంచావరణార్చనల

సామూహిక భోగిపండ్ల కార్యక్రమం:

భోగిరోజున అనగా 14వ తేదీన ఉదయం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉచితంగా సామూహిక భోగిపండ్ల కార్యక్రమం నిర్వహించబడుతుంది. సనాతన ధర్మపరిరక్షణలో భాగంగా ఈ సామూహిక భోగిపండ్లు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 5 సంవత్సరాల వరకు వయస్సుగల చిన్నారులకు ఈ భోగిపండ్లు వేయబడుతాయి. ఈ భోగిపండ్ల కార్యక్రమములో పాల్గొనదలచిన వారు 13వ తేదీ సాయంత్రం గం.5.00లలోపల ప్రచురణల విభాగంలో వారి పేర్లను నమోదు చేసుకోవలసి ఉంటుంది.

About Author