NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టికెట్ ఇవ్వ‌లేద‌ని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు వేడెక్కాయి. టికెట్ రాలేద‌ని స‌మాజ్ వాదీ పార్టీ నేత ఆదిత్య ఠాకూర్ ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించారు. ల‌క్నో పార్టీ కార్యాల‌యంలో ఒంటి పై పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. స‌మీపంలోని పోలీసులు ఆయ‌న్ను అడ్డుకున్నారు. పార్టీ అభ్య‌ర్థిత్వం కోసం ఐదేళ్లుగా క‌ష్ట‌ప‌డ్డాన‌ని, అప్పటి నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాన‌ని బోరున విల‌పించారు. ఐదేళ్లుగా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేశాన‌ని తెలిపారు. అలాంటిది త‌న‌ను కాద‌ని వేరే వారికి టికెట్ ఇచ్చార‌ని ఆరోపించారు. త‌న‌కు ఆత్మ‌హత్య త‌ప్ప మ‌రోమార్గం లేద‌ని అన్నారు.

                                     

About Author