పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా ?
1 min readపల్లెవెలుగువెబ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాలంటూ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇవాళ నిర్ణయం తీసుకోనుంది. ఈసీ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న ఒకే విడతలో ఎన్నికలు జరగాలి. కానీ అదే నెల 16 సంత్ గురు రవిదాస్ జయంతి ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 20 లక్షల మంది ప్రజలు ఉత్తరప్రదేశ్ లోని వారణాసి వెళ్తారు. వారందరూ ఓటింగ్ కు దూరం అయ్యే అవకాశం ఉందని పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని ఈసీని కోరారు. దీంతో ఈ విషయం పై కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఢిల్లీలో సమావేశమైన నిర్ణయం తీసుకోనుంది.