కాటసాని పై హైకోర్టు ఆగ్రహం
1 min readపల్లెవెలుగువెబ్ : వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌లో రాంభూపాల్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వాటిని ‘ఆయన అందుబాటులో లేరు’ అంటూ తిప్పి పంపించారు. దీంతో ఆగ్రహించిన హైకోర్టు ‘నోటీసు’ను పత్రికల్లో ప్రకటించాలని ఈ నెల 4న ఆదేశించింది. ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ వేసిన అనుబంధ పిటిషన్‌పై విచారణ జరపాలని ఎమ్మెల్యే తరఫున న్యాయవాది బుధవారం హైకోర్టును అభ్యర్థించారు. ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా కోర్టు ఇచ్చిన నోటీసులు ఎలా నిరాకరిస్తారని ప్రశ్నించింది. ఎమ్మెల్యే తరఫున న్యాయవాది అభ్యర్థన మేరకు రీకాల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరుపుతామని సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్. జయసూర్యల ధర్మాసనం ప్రకటించింది.