NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు !

1 min read

పల్లెవెలుగువెబ్ : తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఎన్నికల అఫిడవిట్ లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయన పై ఫిర్యాదులు అందాయి. వీటిపై చర్యలకు ఎన్నికల కమీషన్ సిద్ధమైంది. 2018 మహబూబ్ నగర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీనివాసగౌడ్ 14-11-2018 న నామినేషన్ దాఖలు చేశారు. దీనిని ఈసీ తమ వెబ్ సైట్‎లో అప్‎లోడ్ చేసింది. ఎన్నికలు పూర్తయి ఫలితాలు రావడానికి రెండు రోజుల ముందు పాత అఫిడవిట్ స్థానంలో కొత్తది ప్రత్యక్షమైంది. తనపై అనర్హత వేటు పడకుండా తప్పించుకునేందుకు సవరించిన అఫిడవిట్‌ను తెలంగాణ ఈసీ అధికారులతో కుమ్మక్కై అప్‌లోడ్ చేయించినట్లు శ్రీనివాసగౌడ్‌పై ఆరోపణలు ఉన్నాయి.

       

About Author