ఎయిర్ టెల్ తో చేయి కలిపిన గూగుల్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్ టెల్ లో దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్ వాటా కొనుగోలుకు సిద్ధమైంది. దాదాపు రూ. 7,500 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఎయిర్‌టెల్‌లో 1.28 శాతం వాటా కోసం గూగుల్ 70 కోట్ల డాలర్లు చెల్లించనుంది. మిగతా 30 కోట్ల డాలర్లను మున్ముందు సంవత్సరాల్లో ఇరువురి భాగస్వామ్య ప్రణాళికల కోసం వెచ్చించనుంది. వినియోగదారులకు తమ కంపె నీ ఆఫర్ చేసే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత డివైజ్‌లు, డిజిటల్ సేవలను మరింత చౌకగా అందుబాటులోకి తేవడంతో పాటు భారత్ కోసం ప్రత్యేకంగా 5జీ యూజ్ కేస్‌లను అభివృద్ధి చేయడం కూడా ఈ ప్రణాళికల్లో భాగమని ఎయిర్‌టెల్ వెల్లడించింది. కంపెనీ 5జీ సేవల ప్రణాళికలతోపాటు జియోకు మరింత గట్టిపోటీ ఇచ్చేందుకు ఎయిర్‌టెల్‌కు ఈ పెట్టుబడులు దోహదపడనున్నాయి.