పాల ధరలు కొండెక్కేనా..?
1 min read
పల్లె వెలుగు వెబ్: ఇప్పటికే డీజిల్, పెట్రోల్ ధరలతో విసిగిపోయిన సామాన్యులకు మరో భారం పడబోతోంది. ఈ సారి నిత్యవసరమైన పాల ధరలు ఆకాశాన్నంటనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి పాల ధరల్లో భారీ మార్పులు జరగనున్నాయి. కొనబోతే కొరివి.. అడగబోతే అడవి అన్నట్టు మారిపోయింది వినియోగదారుల పరిస్థితి. ఏప్రిల్ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం. డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో.. పాల రవాణ కు అధికంగా ఖర్చవుతోంది. దీంతో పాల ధరలు పెంచాల్సిన తప్పనిసరి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏసీలు, ఫ్యాన్ ధరలు కూడ పెరగనున్నాయి. ఇవి ఒక్కోటి 1500 నుంచి 2 వేల వరకు పెరగనున్నాయి. ముడి పదార్థాల పెరుగుదల కారణంగా ఇవి పెరగబోతున్నాయి.