సమస్యలు పరిష్కరించాలంటూ.. వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలు
1 min readపల్లెవెలుగు వెబ్, రాయచోటి: అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ మంగళవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట మండల వీఆర్ఏలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం నేతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వీఆర్ఏలకు డిఏ తో కూడిన 21 వేలు జీతం ఇవ్వడంతోపాటు వీఆర్ఏల అందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.రివర్స్ పిఆర్సి పసంహరించుకోవాలని,నామినీలుగా ఉన్న వారందరినీ విఆర్ఎల్ గా నియమించాలని,అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని,ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వర్తింపచేయాలని,65 సంవత్సరాలు దాటి మృతి చెందిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిసిఎల్ అధికారులు రాష్ట్ర కమిటీతో చర్చలు జరపి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.అనంతరం తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో రాయచోటి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల వీఆర్ఏలు పాల్గొన్నారు.