NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫెడ్ దెబ్బకు కుదేలైన స్టాక్ మార్కెట్

1 min read

పల్లెవెలుగువెబ్ : యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచనుందన్న వార్తలతో భారత స్టాక్ మార్కెట్ కుదేలైంది. 1.5 శాతానికి పైగా నష్టపోయింది. మరోవైపు యూఎస్ ద్రవ్యోల్బణం కూడ ఆల్ టైమ్ గరిష్ఠంగా నమోదు కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతీసింది. యూస్ మార్కెట్లు పెద్ద ఎత్తున నష్టపోయాయి. ఇదే బాటలో భారత్, ఏసియా మార్కెట్లు పయనిస్తున్నాయి. గ్రాసిమ్, ఇన్ఫోసిస్, నెస్లే కంపెనీలు నష్టపోయిన కంపెనీల్లో మొదటి జాబితాలో ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సెన్సెక్స్ 725 పాయింట్లు నష్టపోయి 58200 వద్ద, నిఫ్టీ 218 పాయింట్లు నష్టపోయి 17386 వద్ద , బ్యాంక్ నిఫ్టీ 376 పాయింట్లు నష్టపోయి 38634 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

   

About Author