మావోలకు నిధులు.. కాంట్రాక్టర్ల ఇంట్లో ఎన్ఐఏ సోదాలు !
1 min readపల్లెవెలుగువెబ్ : మావోయిస్టులకు నిధులు సమకూరుస్తున్న కేసులో ఎన్‌ఐఏ అధికారులు ఏపీలోని నెల్లూరుతోపాటు ఒడిసా, బిహార్, జార్ఖండ్ రాష్ర్టాల్లో 26 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్‌పార్కు సమీప రాంజీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ప్రముఖ కాంట్రాక్టర్ పెంచలనాయుడు ఇంటికి ఎన్‌ఐఏ అధికారులు చేరుకున్నారు. పెంచలనాయుడు ఇంట్లో లేకపోవడంతో కుటుంబసభ్యులకు విషయం తెలియజేసి 3గంటలు ఇంట్లో సోదాలు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్నారన్న అభియోగాలపై నెల్లూరుకే చెందిన అనిల్‌యాదవ్ ఇంట్లోనూ ఎన్‌ఐఏ సోదాలు జరిపింది. 2008లో బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ నివాసాన్ని పేల్చివేసిన కేసులో నిందితుడైన మావోయిస్టు సహదేవ్ యాదవ్‌కు అనిల్‌యాదవ్ పేలుడు పదార్థాలకు నిధులిచ్చి సహకరించినట్లు ఎన్‌ఐఏ ఆధారాలు సేకరించినట్లు సమాచారం.