NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇన్ఫోసిస్ లో 55,000 ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ లో 55,000 ఉద్యోగాలు కల్పిస్తామని సంస్థ సీఈవో సలీల్ పరేఖ్ అన్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వార వచ్చే ఆర్థిక సంవత్సరం 2022 _23లో ఉద్యోగులను నియమించుకోనున్నట్టు తెలిపారు. భవిష్యత్ లో ఐటీ రంగంలో వృద్ధి అవకాశాలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. విద్యార్థులు వీలున్నప్పుడల్లా తక్కువ వ్యవధిలో కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ ఉంటే మంచి భవిష్యత్ ఉంటుందని ఆయన అన్నారు. 2021_22 ఆదాయాల్లో 20 శాతం ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. క్లౌడ్ ఆధారిత సేవలకు మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. క్లౌడ్ టెక్నాలజీ పై పట్టు కలిగి ఉంటే.. కంపెనీలో చేరడానికి, వృద్ధిపథంలో వెళ్లడానికి ఫ్రెషర్లకు మంచి అవకాశాలను ఇస్తుందని ఆయన తెలిపారు.

             

About Author