PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌మ‌ల్ హాస‌న్.. సినిమా విడుద‌ల కాక‌ముందే రూ. 115 కోట్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించి విక్ర‌మ్ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల‌కానుంది. సినిమాకు సంబంధించిన శాటిలైట్, డిజిలైట్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం డిస్నీ+హాట్ స్టార్ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుందని కోలీవుడ్‌లో టాక్. డిస్నీ సంస్థ దాదాపుగా రూ.115కోట్లు చెల్లించి హక్కులను కోనుగోలు చేసిందని సమాచారం. ఈ చిత్రాన్ని రూ.110కోట్ల‌ భారీ బడ్జెట్‌‌తో నిర్మించారు. అంటే విడుదలకు ముందే దాదాపుగా రూ. 5కోట్లు లాభం వచ్చిందని తెలుస్తోంది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారానే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టింది. అదనంగా అయిదు కోట్ల లాభాలను పొందిన కమల్‌కు.. థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చేదంతా అదనపు లాభాలే అని చెప్పవచ్చు.

                                    

About Author