నష్టాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగువెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ ను రష్యా, ఉక్రెయిన్ యుద్ధ భయాలు వీడడం లేదు. రష్యా ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఈ అనిశ్చితి మధ్య క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. 11 సంవత్సరాల గరిష్ఠానికి చేరుకున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగుతున్నారు. బాండ్ ఈల్డ్స్ కూడ పెరిగాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు అనంతరం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్, యూరప్ మార్కెట్లు కూడ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 166 పాయింట్ల నష్టంతో 55301 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 16550 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.