ప్రతి షోకు టికెట్లు పంపండి.. థియేటర్లకు మేయర్ లేఖ !
1 min readపల్లెవెలుగువెబ్ : ‘కొత్తగా విడుదలైన సినిమా ప్రతి షోకు 100 టికెట్లు మేయర్ చాంబర్‌కు పంపండి’ అంటూ విజయవాడ నగరంలోని మల్టీప్లెక్స్ థియేటర్ యజమానులకు నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి రాసిన లేఖ సారాంశం ఇది. వైసీపీ కార్యకర్తలు, కార్పొరేటర్లు కొత్త సినిమా టికెట్లు కావాలని ఒత్తిడి తీసుకొస్తున్నందున, ప్రతి షోకు తమకు వంద టికెట్లు కేటాయించాలని కోరారు. ఈ మేరకు ఆమె నగరంలోని అన్ని మల్టీప్లెక్స్ యజమానులకు లేఖలు రాశారు. దానికయ్యే డబ్బులు చెల్లిస్తామని పేర్కొన్నారు. మేయర్ తీరుని విపక్షాలు విమర్శిస్తున్నాయి.