పరిషత్ ఎన్నికల మీద నేడు విచారణ
1 min readపల్లె వెలుగు వెబ్: రాష్ట్రంలో ఈనెల 8న జరగాల్సిన పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఎస్ఈసీ నిబంధనలు పాటించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే.. ఈ తీర్పు మీద ఎస్ఈసీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఎస్ఈసీ పిటిషన్ డివిజన్ బెంచ్ విచారణకు తీసుకుంది. పిటిషనర్ పోటీ చేస్తున్న అభ్యర్థికాదని, సింగిల్ బెంచ్ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పిటిషన్ కొట్టేయాల్సిందని ఎస్ఈసీ కోరింది. నాలుగు వారాల కోడ్ ఉండాలన్న నిబంధనలేదని ఎస్ఈసీ స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఏ సందర్భంలో ఆ తీర్పు వెలువరించిందో పరిగణించాలని ఎస్ఈసీ కోరింది. అయితే.. ఎస్ఈసీ పిటిషన్ మీద ఇవాళ విచారణ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు తీర్పు మీద ఆసక్తి కరంగా ఎదురుచూస్తున్నారు.